‘మర్డర్’ మూవీపై అమృత ప్రణయ్ తీవ్ర అభ్యంతరం

ABN , First Publish Date - 2020-08-04T23:00:11+05:30 IST

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి ‘మర్డర్‌’ మూవీ వస్తున్న విషయం విదితమే.

‘మర్డర్’ మూవీపై అమృత ప్రణయ్ తీవ్ర అభ్యంతరం

నల్లగొండ : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి ‘మర్డర్‌’ మూవీ వస్తున్న విషయం విదితమే. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. ‘ప్రణయ్ అమృత’ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది!. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’ అనే పాటను సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమాపై అమృత ప్రణయ్ తాజాగా స్పందించారు.


జీవితాలతో చెలగాటమా..!?

మంగళవారం నాడు ఈ మూవీకి సంబంధించి అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మూవీపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవితాలతో సినిమా దర్శకులు, నిర్మాత చెలగాటమాడుతున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అభ్యంతరం తెలిపారు.


ఆగస్టు-06న..

మర్డర్ స్టోరీలో తమ పేర్లు, ఫొటోస్ వాడుకున్న విషయమై అదే విధంగా సినిమాను నిలిపి వేయాలని గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సూట్ ఫైల్ వాట్సప్, మెయిల్ ద్వారా కోర్టు సినిమా దర్శకునికి, నిర్మాతకు నోటీసుల చేరాయి. ఆగస్టు- 6న నల్గొండ కోర్టులో మర్డర్ సినిమా దర్శకుడు, నిర్మాతకు హియరింగ్ ఉంది. రెండేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతున్న ఈ తరుణంలో మర్డర్ సినిమాను సృష్టించి సినిమా తీసి జీవితాలతో చెలగాటాలాడటం సరికాదుఅని అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-08-04T23:00:11+05:30 IST