మిర్యాలగూడ: మారుతీరావు ఆస్తులు తనకు అవసరం లేదని.. ఆయన సోదరుడు శ్రవణ్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. మారుతీరావు మృతి తనకు శుభవార్త అని అమృత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి చావును అమృత కోరుకుందని.. మారుతీరావు భార్య మంగళసూత్రం తీశాకే తను తీస్తానందన్నారు. ఆస్తి కోసం అమృత డ్రామాలు ఆడుతోందన్నారు. అమృతవి మెచ్యురిటీ లేని మాటలని.. తన వల్ల ప్రాణహాని ఉందని అనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. మారుతీరావు ఏమీ అనలేక.. తనపేరును ఉపయోగించుకొనేవాడని శ్రవణ్ తెలిపారు. మారుతీరావు ఎవరి దగ్గరయినా అప్పు తీసుకుంటే ఇచ్చేస్తామని.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. ఎవరినీ బెదిరించి భూములు తీసుకోలేదన్నారు. తనకు చెప్పకుండా మారుతీరావు ఏ పనీ చేయడని ఆయన తెలిపారు. తమకు వ్యాపారం, కుటుంబం తప్ప వేరే ధ్యాస లేదని ఆయన వాపోయాడు.