Abn logo
Mar 3 2021 @ 10:06AM

పిల్లల అశ్లీల వీడియోలు పెట్టిన వ్యక్తి అరెస్ట్

అమృతసర్ (పంజాబ్): చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అమృతసర్ కు చెందిన ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి పంజాబ్ పోలీసులు నిందితుడి తమ్ముడిపై కూడా కేసు నమోదు చేశారు. సోదరులైన ఇద్దరు నిందితులు చైల్డ్ పోర్న్ వీడియోలను తన మెసేజింగ్ ప్లాట్‌ఫాం మెసెంజర్ ద్వారా పంచుకుంటున్నారని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు (ఎంహెచ్‌ఏ) ఫిర్యాదు చేసింది.ఫేస్‌బుక్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని కేంద్రహోం మంత్రిత్వ శాఖ పంజాబ్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆదేశించింది. 

పిల్లల అశ్లీలతకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలను అమృతసర్ కు చెందిన ఇద్దరు సోదరులు పంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అమృతసర్ నగరంలో మొబైల్ రిపేర్ షాపు నడుపుతున్న కరణ్ అనే వ్యక్తి తన తమ్ముడు లోవిష్ తో కలిసి పిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నాడని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడైన లోవిష్ పరారీలో ఉన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement