సైఫ్ భార్య పిల్లల్ని వద్దనుకుందట! ఎందుకంటే...

బాలీవుడ్‌లో ఖాన్స్ అనగానే మనకు షారుఖ్, సల్మాన్, ఆమీర్ గుర్తుకు వస్తారు. తెర మీద వారి రొమాన్స్‌లు భారీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ, రియల్ లైఫ్‌లో వీర లెవల్ రొమాన్సులు నడిపాడు మరో ఖాన్! అతనే... సైఫ్ అలీఖాన్...

సైఫ్ మొదటి భార్య అమృతా సింగ్. ఆమె కంటే అతను 12 ఏళ్లు చిన్న! అయితే, ఈ బాలీవుడ్ క్రేజీ కపుల్ ఇద్దరు పిల్లలు పుట్టాక 13 ఏళ్ల కాపురం అనంతరం విడిపోయారు. కొన్నాళ్లకి సైఫ్ లైఫ్‌లోకి కరీనా సెకండ్ వైఫ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈమెతోనూ బాలీవుడ్ అందగాడికి ఏజ్ డిఫరెన్సే. మొదటి భార్య సైఫ్ కంటే 12 ఏళ్లు పెద్దైతే రెండో భార్య 10 ఏళ్లు చిన్న! ఇలా రెండు సార్లు పెళ్లి చేసుకుని రెండేసి సార్లు అవాక్కయ్యేలా చేశాడు చోటే నవాబ్...

అమృతా సింగ్‌ని, కరీనాని పెళ్లి చేసుకున్న సైఫ్ అలీఖాన్‌కు మొత్తం నలుగురు పిల్లలు. మొదటి భార్య ద్వారా ఒక కొడుకు, ఒక కూతురు కాగా రెండో భార్యతో ఇద్దరు కొడుకులు. అయితే, గతంలో అమృతా సింగ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాము మొదట్లో పిల్లలు వద్దనుకున్నామని చెప్పింది. అప్పటికి సైఫ్ వయస్సు 21 ఏళ్లే. పైగా అతడి కెరీర్ అప్పుడప్పుడే ఊపందుకుంటోంది. అమృతా సింగ్ వయస్సు 33 ఏళ్లైనా వెంటనే పిల్లల్ని కనలేదట. కారణం... సైఫ్ కెరీర్ మీద దృష్టి నిలపాలని! పెళ్లికాగానే పిల్లల్ని కనేస్తే తండ్రిగా అతడి మీద బాధ్యతలు పడతాయని అమృతా భావించిందట. అందుకే, కొన్నేళ్ల పాటూ సైఫ్, అమృతా సింగ్ సంతానం ఆలోచన చేయలేదు. తరువాత ఎట్టకేలకు ఒక పాప, ఒక బాబు పుట్టారు. అబ్బాయి ఇబ్రహీం అలీఖాన్ కాగా అమ్మాయి సారా అలీఖాన్. బీ-టౌన్ హాట్ బ్యూటీస్‌లో సైఫ్, అమృతల వారసురాలు కూడా ఒకరు... 

Advertisement

Bollywoodమరిన్ని...