భూగర్భజలాల పెంపునకు అమృత్‌ సరోవర్‌ దోహదం

ABN , First Publish Date - 2022-05-25T05:21:10+05:30 IST

వర్షపు నీటిని నిలువచేసి భూగర్భ జలాలను వృద్ధి చేయడానికి ఆజాదీకా అమృత్‌సరోవర్‌ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా అడిషనల్‌ డీఆర్డీవో విరోజ పేర్కొన్నారు.

భూగర్భజలాల పెంపునకు అమృత్‌ సరోవర్‌ దోహదం

తూప్రాన్‌రూరల్‌, మే 24: వర్షపు నీటిని నిలువచేసి భూగర్భ జలాలను వృద్ధి చేయడానికి ఆజాదీకా అమృత్‌సరోవర్‌ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా అడిషనల్‌ డీఆర్డీవో విరోజ పేర్కొన్నారు. జిల్లాలో పలుచోట్ల అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం కింద ఉపాధి కూలీలతో కొత్తగా కుంటకట్టల నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లోని జాలగుండు ప్రాంతంలో ఊటకుంట నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షపు నీరు వృధా కాకుండా అడ్డుకట్టలు వేయడానికి మట్టికట్టలను పోస్తున్నట్లు చెప్పారు. కట్టల నిర్మాణాలతో భూగర్భజలాలను అభివృద్ధి చేయడమే అమృత్‌ సరోవర్‌ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఏపీడీ బాలయ్య, ఎంపీడీవో అరుంధతి, ఈజీఎస్‌ ఏపీవో సంతో్‌షరెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సురేశ్‌, సర్పంచు మహదేవి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:21:10+05:30 IST