అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటు

ABN , First Publish Date - 2021-09-17T09:20:04+05:30 IST

అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు.

అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటు

639వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

తుళ్లూరు, సెప్టెంబరు 16:  అభివృద్ధిని అడ్డుకోవటం సిగ్గు చేటని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా  కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు  చేస్తున్న ఉద్యమం గురువారం 639వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ... సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రాతిపాదన తెచ్చింది అమరావతిని నిర్వీర్యం చేయటం కోసమేనన్నారు.   13 జిల్లాల వాసులకు సమదూరంలో ఉండేది అమరావతి అని పేర్కొన్నారు.    తుళ్లూరు, పెదపరిమి, దొండపాడు, అనంతవరం , నెక్కల్లు, ఐనవోలు, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం వెంకటపాలెంతో తాడికొండ మండలం మోతడక, తాడికొండలలో   రైతు  ధర్నా శిబిరాల నుంచి రాజధాని అమరావతి  కొనసాగాలని ఆందోళనలు, నిరసనలు జరిగాయి.  

Updated Date - 2021-09-17T09:20:04+05:30 IST