Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాదయాత్రకు ఆటంకాలపై అమరావతి జేఏసీ ఆగ్రహం

నెల్లూరు: పాదయాత్రకు పోలీసులు ఆటంకాల సృష్టిస్తున్నారని అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాపాదయాత్రకు అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారని, మహిళల పట్ల సీఐ నాగమల్లేశ్వరరావు అగౌరవంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ మండిపడింది. పలు ప్రాంతాల్లో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలు అడ్డంకులు ఎదుర్కొన్న అమరావతి రైతుల మహాపాదయాత్ర 34వ రోజు శనివారం జోరుగా, హుషారుగా సాగింది. దారి పొడవునా ఎదురొచ్చిన వివిధ గ్రామాల రైతులు రాజధాని  పాదయాత్రీకులకు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం 9గంటలకు సైదాపురం నుంచి  మహాపాదయాత్ర ప్రారంభమైంది. గూడూరు నియోజవర్గం లోని తిప్పవరప్పాడు నుంచి కందలి, చెమర్తిల మీదుగా పుట్టంరాజుకండ్రిగ వరకు సాగుతుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

Advertisement
Advertisement