అమరావతే ఏకైక రాజధాని

ABN , First Publish Date - 2022-01-20T04:30:28+05:30 IST

ఏపీ రాషా్ట్రనికి అమరావతే ఏకైక రాజధాని అని రాష్ట బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

అమరావతే ఏకైక రాజధాని
మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

  1.  వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం 
  2.  రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోంది: సోము వీర్రాజు 


బనగానపల్లె, జనవరి 19: ఏపీ రాషా్ట్రనికి అమరావతే ఏకైక రాజధాని అని రాష్ట బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని  విమర్శించారు. బనగానపల్లె పట్టణంలోని చక్రవర్తి ఫంక్షనహాల్‌లో బుధవారం బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన నియోజకవర్గం బీజెపీ కార్యకర్తల సమావేశం బీజేపీ నాయకుడు ముత్తుకూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి, కార్యదర్శి చిరంజీవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వడ్డెనాగరాజు, లింగన్న, హేమసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో బీజేపీ జనసేన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందుతామని, రాఽజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ఒక్క రాజధానిని నిర్మించడం చేత గాక మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఉద్యోగులను పీఆర్‌సీ పేరుతో నిలువునా ముంచిందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోందన్నారు. నిమ్న, బలహీన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపి మద్దతు ఉంటుందన్నారు. ఓబీసీలకు కూడా పదిశాతం రిజర్వేషన కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. 24 గంటలు విద్యుత వస్తోందంటే ప్రధాని నరేంద్రమోదీ విధానాలే కారణమన్నారు. సర్పంచలకు కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్సు నిధులు మంజూరు చేస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుండడంతో నేరుగా సర్పంచ ఖాతాల్లోకి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.       ఆత్మకూరులో కొందరు ఉగ్రవాదుల ప్రోద్బలంతో అల్లరి మూకలు బుడ్డా శ్రీకాంతరెడ్డిపై దాడి చేసి  పోలీ్‌సస్టేషనపె కూడా దాడి చేశారని విమర్శించారు. ఎస్పీ విచారించి దాడులకు కారణాన్ని ప్రెస్‌ మీట్‌లోనే బయటపెట్టారన్నారు. అమరావతి రాజధానిని నిర్మిస్తామని, ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి, డాక్టర్‌ పార్థసారధి, చిరంజీవిరరెడ్డి మాట్లాడుతూ 30 నెలలుగా ముఖ్యమంత్రి రాష్ర్టాన్ని గాలికి వదిలేఽశారని విమర్శించారు. కార్యక్రమంలో శివకృష్ణయాదవ్‌, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T04:30:28+05:30 IST