న్యాయస్థానాలే ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-07-11T08:41:03+05:30 IST

రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

న్యాయస్థానాలే ఆదుకోవాలి

  • 206వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు 

తుళ్లూరు, జూలై 10: రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలు శుక్రవారానికి 206వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు, మహిళలు మా ట్లాడుతూ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు ఆపి, రాజధాని తరలింపునకు కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణం పనులు నిలిపివేసి విజయవాడలో శంకుస్థాపన చేయటం ఇందులో భాగమేనని తెలిపారు. న్యాయస్థానాలే తమను ఆదుకోవాలని వి జ్ఞప్తిచేశారు. తాము ఎవరికీ అన్యాయం చే యలేదని, రాజధానికి భూములు కావాలని గత ప్రభుత్వం అడిగితేనే ఇచ్చామని స్పష్టంచేశారు. అన్ని పార్టీలకు చెందిన అభిమానులు, వర్గాలు వారు రాజధానికి భూములిచ్చారన్నారు. ప్రధాని మౌనం వీడి తమను ఆదుకోవాలని కోరారు.  

Updated Date - 2020-07-11T08:41:03+05:30 IST