భారత్‌లో కార్యకలాపాల నిలిపివేతకు ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ణయం

ABN , First Publish Date - 2020-09-29T21:08:53+05:30 IST

భారత్ లో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. తమ బ్యాంకు ఖాతాలను భారత ప్రభుత్వం అప్రజాస్వామికంగా సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. ఈ నెల పదో తేదీన తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఈడీ పూర్తిగా స్తంభింపజేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

భారత్‌లో కార్యకలాపాల నిలిపివేతకు ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ణయం

లండన్ : భారత్ లో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. తమ బ్యాంకు ఖాతాలను భారత ప్రభుత్వం అప్రజాస్వామికంగా సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. ఈ నెల పదో తేదీన తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఈడీ పూర్తిగా స్తంభింపజేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 


భారత్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై తమ నివేదికల నేపథ్యంలో తమ సభ్యులకు బెదిరింపులు ఎదురవుతున్నాయని సంస్థ వెల్లడించింది. అంతేకాదు... మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు స్పందించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా ఆక్షేపించారు. 


ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కశ్మీర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో ఇక తాము సేవలనందించలేమని స్పష్టం చేశారు. మొత్తం 70 కి పైగా దేశాలలో పనిచేస్తున్న తాము... 2016 లో రష్యాలో మాత్రమే కార్యకలాపాలను నిలిపేసినట్లు వెల్లడించారు. తాజాగా... భారత్‌లో కూడా కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. న్నామని చెప్పారు. ఇక... ఆయా కేసులపై మాత్రం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.  కాగా ఆమ్నెస్టీ నిర్ణయం వివిధ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-09-29T21:08:53+05:30 IST