ఢిల్లీ నీటిలో అమ్మోనియా... అనారోగ్యం తప్పదని ఆందోళన...

ABN , First Publish Date - 2020-10-30T19:31:09+05:30 IST

నీరు జీవనాధారం అయినప్పటికీ చాలా మందికి సురక్షిత నీరు అందుబాటులో ఉండటం లేదు.

ఢిల్లీ నీటిలో అమ్మోనియా... అనారోగ్యం తప్పదని ఆందోళన...

న్యూఢిల్లీ : నీరు జీవనాధారం అయినప్పటికీ చాలా మందికి సురక్షిత నీరు అందుబాటులో ఉండటం లేదు. తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీ వాసులు కూడా ఈ జాబితాలో చేరారు. ఈ నగరానికి యమునా నది నుంచి నీరు సరఫరా అవుతుంది. ఈ నీటిలో అమ్మోనియా ప్రమాదకర స్థాయికి చేరిందని వెల్లడైంది. ఇప్పటికే గాలి కాలుష్యంతో బాధపడుతున్నవారికి నీటి కాలుష్యం వార్తలు వణుకు తెప్పిస్తున్నాయి. ఈ గాలి, నీరు వల్ల తమ ఆరోగ్యం ఎంతగా చెడిపోతుందోనని ఢిల్లీవాసులు భయపడుతున్నారు. 


ఢిల్లీ జల మండలి విడుదల చేసిన ప్రకటనలో యమునా నది నీటిలో అమ్మోనియా స్థాయి తగ్గే వరకు లో ప్రెషర్‌తో నీటిని సరఫరా చేస్తామని తెలిపింది. దీంతో ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారు.  తమ ఆరోగ్యాలు దెబ్బతినడం ఖాయమని ఆవేదన చెందుతున్నారు. 


అమ్మోనియా అనేది హైడ్రోజన్, నైట్రోజన్ కలిసిన. వాయు రూప మిశ్రమం, రంగులేని పదార్థం. ఇది నీటిలో బాగా కరుగుతుంది. మితిమీరిన అమ్మోనియా ఉన్న నీటిని వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను ఒరెగావ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ సర్వీసెస్ వివరించింది. 


- గాలిలో ఉండే అమ్మోనియా వల్ల మానవుల కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులు, ముక్కు మండుతున్నట్లు అనిపిస్తాయి. 


- తాగే నీటిలో అత్యధిక అమ్మోనియా ఉంటే అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడవచ్చు. 


Updated Date - 2020-10-30T19:31:09+05:30 IST