ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణలు

ABN , First Publish Date - 2022-10-05T05:14:29+05:30 IST

దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాల్లో మంగళవారం రాత్రి అమ్మవార్లు వివిధ అలంకరణలలో భక్తులు దర్శనమిచ్చారు.

ఆకట్టుకున్న అమ్మవారి అలంకరణలు
మార్కాపురంలో అమ్మవారి అలంకరణ

మార్కాపురం(వన్‌టౌన్‌), అక్టోబరు 4: దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాల్లో మంగళవారం రాత్రి అమ్మవార్లు వివిధ అలంకరణలలో భక్తులు దర్శనమిచ్చారు. రాజ్యలక్ష్మీ అమ్మవారు విజయ లక్ష్మీగా,  జగదాంబ అమ్మవారు సిద్ధిదాయినిగా రమాదేవి అమ్మవారు గజలక్ష్మీగా,  బంగారమ్మ మహిషాసురమర్ధినిగా, వాసవీమాత గజలక్ష్మీ గా దర్శనమిచ్చారు. ప్రసన్న రామాలయం, పట్టాభి రామాలయాలలో సీతాదేవి గాయత్రీ దేవి గజలక్ష్మీ అలంకారాలలో భక్తులకు దర్శన మిచ్చారు. ఈవోలు ఈదుల చెన్నకేశవరెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పి.కేశవరావు, తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వేదపండితులు ఆర్‌ శ్రీరామచంద్రమూర్తి ఆలయకమిటి అధ్యక్షులు కె పుల్లారావు, కార్యదర్శి సూరే శివాంజనేయులు తదితరులు పాలొ ్గన్నారు. జి.వెంకటసుబ్బయ్య కుటుంబీకులు వంశపారపర్యంగా శాశ్వత అన్న సంతర్ఫణ కార్యక్రమం నిర్వహించారు. 2000 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. 

త్రిపురాంతకం : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీబాలాత్రిపురసుందరీదేవి అమ్మ వారు మంగళవారం శ్రీసిద్ధిదాయనిదేవి అలం కారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహర్నవమి సందర్భంగాభక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు, చిన్నమస్తాదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వేదపండితులు ఫణీంద్రకుమార్‌శర్మ, అర్చకులు ప్రసాద్‌శర్మ, విశ్వనారాయణశాస్త్రిలు పూజా క్రతువు నిర్వహించారు.  త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయఉత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు బుధవారం శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, చైర్మన్‌ పద్మజ పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో, పోలేరమ్మ దేవాలయంలో, మోట్ల మల్లికార్జునాపురం వద్ద ఉన్న శివాలయంలో శరన్నవరాత్రి వేడుకలు నిర్వ హిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అమ్మవారు మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహిం చారు. 

గిద్దలూరు : గిద్దలూరులో దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు వైష్ణవిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయంలో హోమ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గర్రె సత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు దమ్మాల జనార్థన్‌, కమిటీ సభ్యులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని సోమవారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 19వ బ్రహ్మోత్సవాలలో భాగంగా షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారు కృష్ణావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పలు దేవాలయాలలో, గ్రామీణ ప్రాంత దేవాలయాల్లో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం విజయదశమి పండుగ కావడంతో భక్తుల సౌకర్యార్ధం ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

అలంరించిన సంగీత విభావరి

మార్కాపురం(వన్‌టౌన్‌) : దసరా సంద ర్భంగా స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం లో మహతీ సంగీత శిక్షణాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరీ ఆకట్టు కుంది. అన్నమా చార్య, రామదాసు కీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆలయ చైర్మన్‌ కేశవరావు, ఈఓ జి.శ్రీనివాసులరెడ్డి కళాకారులను అభినందించి సన్మానించారు.


Updated Date - 2022-10-05T05:14:29+05:30 IST