బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా కీలక సమావేశం

ABN , First Publish Date - 2022-09-17T16:37:48+05:30 IST

మరికాసేపట్లో హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతల(BJP Main Leaders)తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Central home minister Amith Shah) కీలక సమావేశం

బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా కీలక సమావేశం

Hyderabad : మరికాసేపట్లో హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతల(BJP Main Leaders)తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Central home minister Amith Shah) కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అమిత్ షాతో బీజేపీ నేతల సమావేశం(BJP Leaders meeting)పై రాజకీయంగా సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సమావేశానికి బండి సంజయ్(Bandi Sanjay), తరుణ్ చుగ్(Tarun chug), కిషన్ రెడ్డి(Kishan Reddy), లక్ష్మణ్, అర్చింద్,  డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, గరికపాటి, పొంగులేటి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులు హాజరు అయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు బైపోల్(Munugode bypoll) సహా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. 


మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. ఇక్కడ నేతలు ఎలా నడుచుకోవాలి? ఎలా క్యాంపెయిన్ చేయాలి? తదితర విషయాలపై అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి చేరువ కావొచ్చనేది అన్ని పార్టీల భావన. ఈ క్రమంలోనే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే మునుగోడులో ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీజేపీ.. ఇక వ్యూహాలకు పదును పెట్టి విజయం దిశగా దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాగా.. ఈ సమావేశానికి ముందు ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. అయితే  అమిత్‌షాతో రాజకీయాల గురించి ఏమీ చర్చించలేదని గోపిచంద్ మీడియాకు తెలిపారు. దేశంలో క్రీడారంగం అభివృద్ధిపై మాత్రమే మాట్లాడినట్టు వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అమిత్ షా తెలిపారని పుల్లెల గోపిచంద్ తెలిపారు. 

Updated Date - 2022-09-17T16:37:48+05:30 IST