Abn logo
Nov 28 2020 @ 09:42AM

ఎస్పీ బాలు పాత్రలో అమితాబ్?

రెండే రెండు పాత్రలతో నటుడు, రచయిత తనికెళ్ల భరణి రూపొందించిన చిత్రం `మిథునం`. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించారు. 2012లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా మంది మనసులను గెలుచుకుంది. ఈ సినిమా త్వరలో బాలీవుడ్‌లోకి రీమేక్ కాబోతోందట. 


బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందట. ఎస్పీ బాలు నటించిన పాత్రలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారట. అలాగే అమితాబ్‌కు జంటగా ఒకనాటి అందాల తార రేఖ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి, ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement