కరీనా కపూర్ కాళ్లు కడిగిన Amitabh Bachchan.. ఆ సమయంలో దెయ్యంలా..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలు, కేబీసీతో ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. అయినప్పటికీ వీలు కుదిరిప్పుడల్లా ఆయనకు సంబంధించిన బ్లాగ్‌లో తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ఉంటాడు. 2013లో ఇలాగే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌తో జరిగిన ఓ సంఘటన గురించి రాశాడు బిగ్ బీ.


‘నేను, కరీనా కపూర్ తండ్రి ‘పుకార్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. నేను అతనిపై పడి పిడిగుద్దులు కురిపిస్తున్నాను. అప్పుడు కరీనా చాలా చిన్న పిల్ల. ఎంతో క్యూట్‌గా ఉండే ఆ పాప ఈ సీన్‌ని చూసి మా వద్దకి పరిగెత్తుకుంటు వచ్చింది. తన కాలికి దెబ్బ తగిలిన పట్టించుకోకుండా తన తండ్రిని నా నుంచి కాపాడడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో నేను తనకి ఓ దెయ్యంలా కనిపించినట్లుగా ఉన్నా’నని రాసుకొచ్చాడు అమితాబ్.


అంతేకాకుండా.. ‘కరీనా భయంతో ఏడుస్తూ, ఎంతో కలత ఉంది. ఆమె కాళ్లకి ఇసుక అంటుకుని కొంచెం ఇబ్బందిగా కనిపించింది. అది చూసిన నేను నీళ్ల తన చిట్టి పాదాలను కడిగాను. ఈ ఘటనతో నెమ్మదించిన తను అది నటనలో భాగమే కానీ నిజం కాదని తనకి అర్థమయ్యినట్లు ఉంది. దీంతో నాపై తనకి ఉన్న కోపం కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఆ పాప నన్ను దెయ్యంలా చూడకపోవడంతో నాకు మనశ్శాంతిగా అనిపించింది. ఇప్పటికి ఈ మూమెంట్ తనకి గుర్తుంద’ని తెలిపాడు బిగ్ బీ. 2019లో దీనికి సంబంధించిన ఫోటోని సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు అమితాబ్. అందులో.. ‘ఎవరో గేస్ చేయండి.. అది గోవాలో ‘పుకార్‌’ సినిమా షూటింగ్2కి వచ్చిన కరీనా’ అంటూ చెప్పాడు ఈ స్టార్. 


అయితే 2000లో అభిషేక్ బచ్చన్ హీరోగా చేసిన ‘రిఫ్యూజీ’తో బాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది కరీనా. అనంతరం అమితాబ్ బచ్చన్‌తో కలిసి దేవ్, కబీ ఖుషి కబీ గమ్, సత్యాగ్రహ అనే సినిమాల్లో నటించింది.


Advertisement