Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 15:56:01 IST

Allu Arjun: Pushpa సినిమాలో ఆ ఒక్క సీన్‌ గురించి Amitabh Bachchan కు డౌట్.. సుకుమార్‌ను పిలిచి మరీ అడిగితే..

twitter-iconwatsapp-iconfb-icon

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోను రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రంతో బన్నీ ఉత్తరాది వారికీ కూడా చేరువయ్యాడు. ఈ మూవీలోని పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ‘పుష్ప’ లో శ్రీ వల్లీ పాటలో బన్నీ చెప్పులతో వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ హుక్ స్టెప్‌కు సంబంధించిన రహస్యాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.        


అమితాబ్ కథలను అద్భుతంగా చెబుతాడని అందరికి తెలిసిందే. అతడు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-14’ కు (Kaun Banega Crorepati) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలోని ఓ ఎపిసోడ్‌లో హుక్ స్టెప్‌కు సంబంధించిన రహస్యాన్ని పంచుకున్నాడు. షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ ‘పుష్ప’ ప్రస్తావనను తీసుకురావడంతో ఆ స్టెప్ వెనకున్న కథను చెప్పాడు. ‘పుష్ప’ ను చూసినప్పుడు శ్రీ వల్లీ పాటలో అల్లు అర్జున్ చెప్పులతో వేసిన స్టెప్ చూడగానే నాకు ఆసక్తి కలిగిందని బిగ్ బీ చెప్పాడు. ఆ స్టెప్‌ను కావాలనే కొరియోగ్రఫీ చేశారా లేదా ఏమయినా తప్పు జరిగిందా అనేది తెలుసుకోవాలనిపించిందని పేర్కొన్నాడు. తాను హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడైన సుకుమార్‌ను ఈ స్టెప్ గురించి అడిగానన్నాడు. అందుకు సుకుమార్ సమాధానమిస్తూ.. ‘‘అల్లు అర్జున్ డ్యాన్స్ చేసినప్పుడు చెప్పు జారిపోయింది. అదే స్టెప్‌గా మారింది’’ అని బిగ్ బీ‌కీ చెప్పాడు. అనంతరం ఆ డ్యాన్స్ మూవ్ దక్షిణాది ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్‌గా మారిపోయి చరిత్రను సృష్టించింది. ఇక అమితాబ్  బచ్చన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌ను పూర్తి చేశాడు. ‘గుడ్ బై’, ‘గణపత్’, ‘ప్రాజెక్ట్-కె’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.    

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement