Abn logo
Jul 13 2020 @ 05:37AM

ప్ర‌స్తుతం బిగ్‌బీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయంటే...

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు అతని కుటుంబంలోని మరో ముగ్గురు కరోనా బారిన ప‌డిన విష‌యం విదిత‌మే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ రెండు రోజుల క్రితం క‌రోనా క‌ష్ట‌కాలంలో ధైర్యంగా ఉండాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. బచ్చన్ ఇంటిలోకి కరోనా ప్ర‌వేశించింద‌ని తెలుసుకున్న అభిమానులు క‌ల‌త చెంది, వారి ఆరోగ్యం కోసం ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం అమితాబ్ చేతిలో ప‌లు బాలీవుడ్ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజ‌క్టులు ఉన్నాయి. ప్రముఖ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ చిత్రం బ్రహ్మాస్త్రలో అమితాబ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు రణబీర్ కపూర్, అలియాభట్, మౌని రాయ్, అక్కినేని నాగార్జున, డింపుల్ కపాడియా త‌దిత‌రులు కూడా న‌టిస్తున్నారు. అలాగే రమ్మీ జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్న‌ ఫేస్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీల‌క‌ పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు నాగరాజ్ మంజులే చిత్రం ఝుండ్‌లో అమితాబ్ బచ్చన్ రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్ పాత్రలో నటించనున్నారు. అదేవిధంగా దర్శకుడు షూజిత్ సర్కార్ చిత్రం షూ బైట్‌లో అమితాబ్ బచ్చన్ న‌టించ‌నున్నారు. దర్శకుడు అనీస్ బాజ్మీ రూపొందిస్తు్న‌ ఆంఖే- 2లో అమితాబ్ న‌టించ‌నున్నారు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రం బుద్ధం శరణం గచ్ఛామి, టైమ్ మెషిన్ త‌దిత‌ర చిత్రాల‌లో న‌టించేందుకు అమితాబ్ క‌మిట్ అయ్యారు. వీటికితోడు నిర్మాత ఆర్ బాల్కీ రూపొందించే చిత్రంలోనూ అమితాబ్ బచ్చన్ న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement