Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 14 Jun 2021 11:16:21 IST

షూటింగ్‌కు బ‌య‌లు దేరిన‌ బిగ్ బీ

twitter-iconwatsapp-iconfb-icon

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. ఫ‌లితంగా అన్‌లాక్‌ ప్రక్రియ మొద‌ల‌య్యింది. నెమ్మదిగా ప‌రిస్థితులు సాధారణ స్థితికి వ‌స్తున్నాయి. కొన్ని నిబంధనలతో ముంబైలో సినిమాల షూటింగ్‌ల‌కు అనుమతి ల‌భించింది. దీంతో సినీ న‌టులు ఆనందం వ్య‌క్తం చేస్తూ, షూటింగ్‌ల‌కు బ‌య‌లుదేరుతున్నారు. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ తాజాగా సోష‌ల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు. దానిలో బిగ్ బీ కారులో కూర్చుని, మాస్క్‌తో క‌నిపిస్తున్నారు. లాక్‌డౌన్ అనంత‌రం అమితాబ్ షూటింగ్‌కు వెళుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన అమితాబ్ దాని క్యాప్షన్‌లో 'ఉదయం ఏడు గంటలు.... పనిలోకి వెళ్లేందుకు డ్రైవింగ్..... లాక్‌డౌన్‌ 2.0 తర్వాత మొదటి రోజు షూటింగ్.... పాంగోలిన్ మాస్క్‌ ... ఇక‌పై ప్ర‌తీరోజూ మ‌రింత మెరుగ్గా ఉండ‌బోతోంది.... అని రాశారు. అమితాబ్ బచ్చన్ త్వరలో కౌన్ బనేగా క‌రోడ్ ప‌తి సీజన్- 13 షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నార‌ని తెలుస్తోంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement