అంత చిన్న పర్సులో లేడీస్ ఏం తీసుకెళ్తారు..? ఈ ప్రశ్నకు స్టార్ హీరోయిన్ చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే..

కేబీసీ 13వ సీజన్, బుల్లితెరపై విజయవంతంగా నడుస్తోంది. దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం ‘షోలే’ సినిమా హీరోయిన్ హేమా మాలిని సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా వచ్చారు. ఆమెతో పాటూ హాట్ సీట్‌పై ‘షోలే’ సినిమా దర్శకుడు రమేశ్ సిప్పీ కూడా కూర్చున్నారు. ప్రస్తుతం అమితాబ్, హేమా, రమేశ్ సిప్పీ పాల్గొన్న స్పెషల్ కేబీసీ ఎపిసోడ్ ప్రొమోస్ నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 

సోనీ టీవీ... ‘దసరా స్పెషల్ కేబీసీ ప్రోమోస్’ అంటూ పలు విడుదల చేయగా... ఒక్కటి మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటోంది. లేడీస్ ఇంటి నుంచీ బయలుదేరటప్పుడు చేతిలో స్మాల్ పర్స్ పట్టుకుని బయలుదేరుతారు కదా... అందులో ఏమేం ఉంటాయి అనేది, బిగ్ బి బిగ్ డౌట్! ఆయన ప్రశ్నకి సమాధానంగా హేమా మాలిని, ‘క్లచ్’ అని పిలుచుకునే ఆ చిన్న పర్స్‌లో ‘లిప్ స్టిక్, చిన్న అద్దం, కాస్త ఫేస్ పౌడర్, టచ్ అప్‌కి ఉపయోగపడే పఫ్, అతికొద్ది మొత్తంలో డబ్బులు’ ఉంటాయని చెప్పారు. బయటకి వెళ్లేప్పుడు ఫుల్ మేకప్‌తోనే కదా వెళతారు... మళ్లీ అవన్నీ అవరమంటారా అని అమితాబ్ బచ్చన్ తిరిగి ప్రశ్నించటంతో ‘కొంచెం టచ్ అప్ చేస్తూ ఉండకపోతే కుదరదు కదా’ అని హేమా నవ్వుతూ బదులిచ్చారు!

‘షోలే’ సినిమాలో అమితాబ్ సరసన జయా బచ్చన్ నటించగా హేమా మాలినీకి జోడీగా ధర్మేంద్ర నటించారు. తాజా ఎపిసోడ్‌లో పాల్గొన్న రమేశ్ సిప్పీ బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్‌కి దర్శకుడు. దసరా వేళ కేబీసీ ప్రేక్షకుల్ని ‘షోలే’ స్పెషల్ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయనుంది.

Advertisement

Bollywoodమరిన్ని...