Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 27 Jul 2021 11:41:19 IST

Amitab Bacchan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్క‌లు నాటిన బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌

twitter-iconwatsapp-iconfb-icon
Amitab Bacchan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్క‌లు నాటిన బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌

పార్ల‌మెంట్ స‌భ్యుడు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మ‌హోద్య‌మంలా కొనసాగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు పాల్గొని మొక్కలు నాటి ప్ర‌జ‌లంద‌రినీ భాగం కావాలంటూ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ..మ‌రో మైలురాయిని సాధించింది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, ప‌ద్మ విభూష‌ణ్ అవార్డ్ గ్ర‌హీత‌, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు.  భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను అభినందించారు అమితాబ్‌. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International