Amit sha: జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన

ABN , First Publish Date - 2022-10-01T22:42:05+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అక్టోబర్ 4 నుంచి రెండు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో...

Amit sha: జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అక్టోబర్ 4 నుంచి రెండు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని  ఆయన సమీక్షించనున్నారు. రెండు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రఖ్యాత వైష్ణో దేవీ ఆలయాన్ని సందర్శిస్తారు.


తొలిరోజు పర్యటనలో భాగంగా రాజౌరిలో జరిగే బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వైష్ణోదేవి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 5న శ్రీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగి సమావేశంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, పారామిలటరీ బలగాల ఉన్నతాధికారులు, రాష్ట్ర పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ ఉన్నతస్థాయి సమావేశంలో  పాల్గొంటారు. అనంతరం బారాముల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శ్రీనగర్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు.

Updated Date - 2022-10-01T22:42:05+05:30 IST