జమ్మూ కశ్మీర్ భద్రతపై అమిత్ షా సమీక్ష

ABN , First Publish Date - 2022-03-19T19:44:16+05:30 IST

జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు.

జమ్మూ కశ్మీర్ భద్రతపై అమిత్ షా సమీక్ష

జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని భద్రతాదళాలు సమర్ధంగా అణచివేస్తున్నాయి. అయితే, సరిహద్దు రేఖ వెంబడి పేలుడు పదార్థాలు మనదేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రాడార్ల కళ్లుగప్పి, డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు దేశంలోకి చేరుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో స్థానిక పోలీసులు, పారా మిలిటరీ దళాలు, ఆర్మీ కలిసి పలువురు తీవ్రవాదుల్ని అంతమొందించినప్పటికీ, లష్కర్-ఇ-తయిబా, జైష్-ఇ-మొహమ్మద్ గ్రూప్‌లకు చెందిన తీవ్రవాదులు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పేలుడు పదార్థాలు సరిహద్దు దాటి రాకూడదంటే, యాంటీ డ్రోన్ ఎక్విప్‌మెంట్ సైన్యానికి అవసరం. అమిత్ షా వీటన్నింటిపై చర్చిస్తారు.

Updated Date - 2022-03-19T19:44:16+05:30 IST