తిరుపతి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు తిరపతిలో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 13న తిరుపతికి అమిత్‌షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.