కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగెటివ్

ABN , First Publish Date - 2020-08-09T18:47:03+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ సిన్హా

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా నెగెటివ్

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ సిన్హా ఆదివారం ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అమిత్‌షాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన మేదాంత ఆస్పత్రిలో చేరారు. అమిత్‌షాకు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. త్వరలోనే షా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-08-09T18:47:03+05:30 IST