Abn logo
Apr 10 2021 @ 17:58PM

అమిత్‌షాయే కుట్రదారు : మమతా ఫైర్

కోల్‌కతా : కూచ్‌బెహార్ ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాధ్యత వహించి, రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘‘నేటి ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాయే బాధ్యత వహించాలి. ఆయన కుట్రదారు. కేంద్ర బలగాలను నేనేమీ అనను. కేంద్ర బలగాలు కేంద్ర హోంమంత్రి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాయి. అందుకే అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని మమత పేర్కొన్నారు. మరోవైపు కాల్పులు జరిగిన కూచ్‌బెహార్ ప్రాంతాన్ని దీదీ ఆదివారం సందర్శించనున్నారు. అంతేకాకుండా ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని తృణమూల్ నిర్ణయించుకుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement