Amit Shah: ఆజాన్ వినిపిస్తుండగా అమిత్ షా ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2022-10-06T15:17:13+05:30 IST

జమ్మూ కశ్మీర్‌ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) బారాముల్లాలో ర్యాలీలో ప్రసంగిస్తుండగా(speech) సమీపంలోని మసీదు నుంచి ‘ఆజాన్’ కోసం పిలుపు(azaan plays from mosque) వినిపించింది....

Amit Shah: ఆజాన్ వినిపిస్తుండగా అమిత్ షా ఏం చేశారంటే...

బారాముల్లా(జమ్మూకశ్మీర్):జమ్మూ కశ్మీర్‌ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) బారాముల్లాలో ర్యాలీలో ప్రసంగిస్తుండగా(speech) సమీపంలోని మసీదు నుంచి ‘ఆజాన్’ కోసం పిలుపు(azaan plays from mosque) వినిపించింది. అంతే వెంటనే ర్యాలీలో ప్రజలనుద్ధేశించి మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు.‘‘మసీదులో ప్రార్థన జరుగుతోందా? మసీదులో ప్రార్థన ఉందని నాకు ఇప్పుడే చిట్టీ అందింది’’ అంటూ సభలో అమిత్ షా మాట్లాడారు. మసీదులో ఆజాన్ పిలుపు అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించవచ్చా అని అమిత్ షా ప్రజలను అడిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.




అనంతరం ప్రజలను అడిగి మరీ అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు.అమిత్ షా ఆజాన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జమ్మూకశ్మీరులో నుంచి తీవ్రవాదాన్ని తుడిచిపెడతారని మంత్రి  చెప్పారు.పాకిస్తాన్‌(Pakistan) దేశంతో తాము చర్చలు జరపడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. బారాముల్లాలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, 1990వ సంవత్సరం నుంచి  కశ్మీరులో ఉగ్రవాదం 42వేల మందిని బలిగొందని అమిత్ షా చెప్పారు.ఆజాన్ పిలుపు సందర్భంగా అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపడంతో సభకు వచ్చిన ప్రజలు అమిత్ షా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు చరిచారు.



Updated Date - 2022-10-06T15:17:13+05:30 IST