అనంతపురం: కేంద్రంలో అమిత్షా, రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే పాలకులయ్యారని పీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాపాడగలుగుతుందని శైలజనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి