Abn logo
Nov 29 2020 @ 12:21PM

భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి.


కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్ పర్యటన దృష్ట్యా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సౌత్‌జోన్‌ పోలీసులతో పాటు అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పరిశీలించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు చార్మినార్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Advertisement
Advertisement