Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 13:38:30 IST

Mega crackdown on PFI: పీఎఫ్ఐ ఉగ్రవాద లింకుల వెల్లడి... అమిత్ షా అత్యవసర భేటీ...

twitter-iconwatsapp-iconfb-icon
Mega crackdown on PFI: పీఎఫ్ఐ ఉగ్రవాద లింకుల వెల్లడి... అమిత్ షా అత్యవసర భేటీ...

న్యూఢిల్లీ : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు వెల్లడైన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)  గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval), ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 10 రాష్ట్రాల్లో సుమారు 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. 


ఎన్ఐఏ (National Investigation Agency) గురువారం ఉదయం వివిధ ఇతర సంస్థలతో కలిసి సుమారు 10 రాష్ట్రాల్లో నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వీరు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నట్లు ఆరోపించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో ఈ దాడులు జరిగాయి. అరెస్టయినవారిలో పీఎఫ్ఐ చైర్మన్ ఓఎంఏ సలామ్, ఢిల్లీ పీఎఫ్ఐ చీఫ్ పర్వేజ్ అహ్మద్, ఉత్తర ప్రదేశ్ పీఎఫ్ఐ మాజీ కోశాధికారి నదీం కూడా ఉన్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణ శిబిరాలను నిర్వహించడం, యువతను రాడికలైజ్ చేయడం, నిషేధిత సంస్థలలో చేరే విధంగా ఇతరులను ప్రోత్సహించడం వంటివాటితో సంబంధాలుగలవారి ఇళ్లు, అధికారిక ప్రాంగణాలలో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. 


ఉత్తర ప్రదేశ్ పీఎఫ్ఐ మాజీ కోశాధికారి నదీం గతంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌‌సీ వ్యతిరేక నిరసనల్లో కూడా చురుగ్గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరాల్లో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాలకు ఎన్ఐఏ సీలు వేసింది. ఇదిలావుండగా, కేరళలోని కన్నూరులో కొందరు పీఎఫ్ఐ కార్యకర్తలు రోడ్డును దిగ్బంధనం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


మూడు రోజుల క్రితం రహస్య భేటీ

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మూడు రోజుల క్రితం ఓ సమావేశాన్ని రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఎన్ఐఏ , ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఆ తర్వాత అర్ధరాత్రి అకస్మాత్తుగా దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడులను సమన్వయపరచేందుకు ఆరు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్నవారు అనవసరమైన గొడవలు సృష్టించకుండా నిరోధించేందుకు అర్ధరాత్రి వేళ దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని చాలా ఎన్ఐఏ బృందాలు తిరిగి తమ శాఖా కార్యాలయాలకు వచ్చేశాయి. 


ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్ (DGP Brijlal) మీడియాతో మాట్లాడుతూ, పీఎఫ్ఐకి నేరుగా పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇది చాలా ప్రమాదకర సంస్థ అని చెప్పారు. ఈ సంస్థకు ఇండియన్ ముజాహిదీన్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ దేశవ్యాప్తంగా అనేక బాంబు దాడులకు పాల్పడిందన్నారు. పీఎఫ్ఐకి అరబ్, గల్ఫ్ దేశాల నుంచి నిధులు అందుతున్నాయని చెప్పారు. 


పీఎఫ్ఐపై కీలక నిర్ణయం!

క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, స్పష్టమైన సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షాతో సమావేశంలో ఎన్ఐఏ, ఈడీ అధికారులు, భద్రతా సంస్థల అధికారులు పాల్గొన్నారని, పీఎఫ్ఐ హోదాపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. సాంఘిక, మతపరమైన సంస్థగా చెప్పుకుంటున్న పీఎఫ్ఐకి గతంలో ఉదయ్‌పూర్ టైలర్, అమరావతిలో ఓ ఫార్మసిస్ట్ హత్యలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.