5 లక్షల కుటుంబాలకు ఉచిత గ్యాస్: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-09-19T01:31:07+05:30 IST

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మధ్యప్రదేశ్‌లోని..

5 లక్షల కుటుంబాలకు ఉచిత గ్యాస్: అమిత్‌షా

జబల్‌పూర్: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో శనివారంనాడు ప్రారంభించారు. ఈ పథకం కింద మధ్యప్రదేశ్‌లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి లబ్ధి చేకూరుతుందని, 5 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని ఆయన ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మోదీకి మహిళలంతా ఈశీస్సులు ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారం ఏర్పాటు చేసిందని అన్నారు. ఉజ్వల స్కీమ్ కింద ఇప్పటికీ కొందరు మహిళలు, సోదరీమణులు లబ్ధి పొందలేదని మోదీ ఆ సందర్భంలో చెప్పారని, అందుకు అనుగుణంగా ఈసారి కోటి మందికి ఉజ్వల 2.0 కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రధాని ఇస్తున్నారని తెలిపారు.


ఐదు కోట్ల మంది బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంలో 2016లో ఉజ్వల 1.0 పథకాన్ని ప్రారంభించారు. 2019లో ఆ లక్ష్యాన్ని 8 కోట్ల కుటుంబాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ పథకానికి కనీస స్థాయి పేపర్ వర్క్ మాత్రమే ఉంటుంది. మైగ్రెంట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు ఎలాంటి రేషన్ కార్డులు కానీ , అడ్రస్ ప్రూఫ్ కానీ సమర్పించనవసరం లేదు. ఫ్యామిలీ డిక్లరేషన్, ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్‌లకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది.

Updated Date - 2021-09-19T01:31:07+05:30 IST