Commonwealth Games: బాక్సింగ్‌లో పంఘల్, నీతు ‘పసిడి’ పంచ్‌లు.. ఫైనల్స్‌కు సింధు

ABN , First Publish Date - 2022-08-07T22:27:39+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు పతకాలు కొల్లగొడుతున్నారు. బాక్సర్లు అమిత్ పంఘల్ (Amit Panghal), నీతు గంఘాస్

Commonwealth Games: బాక్సింగ్‌లో పంఘల్, నీతు ‘పసిడి’ పంచ్‌లు.. ఫైనల్స్‌కు సింధు

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు పతకాలు కొల్లగొడుతున్నారు. బాక్సర్లు అమిత్ పంఘల్ (Amit Panghal), నీతు గంఘాస్ (Nitu Ganghas) పురుషుల ప్లైవెయిట్, మహిళల మినిమమ్ వెయిట్ కేటగిరీలో బంగారు పతకాలు సాధించారు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, రజతం రాగా, 10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో కాంస్య పతకం లభించింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ (17.03 మీటర్ల జంప్) పసిడ పతకం సాధించగా, అబ్దుల్లా అబూబాకర్ (17.02 మీటర్లు) రజతం చేజిక్కించుకున్నాడు.  10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.


సెమీస్‌లో వరుస సెట్లలో విజయం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Singdhu) ఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసింది. ఇండియన్ షట్లర్ లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. హాకీలో భారత అమ్మాయిలు కాంస్య పతకం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. బాకింగ్స్‌లో నిఖత్ జరీన్( Nikhat Zareen), సాగర్ అహ్లావత్‌(Sagar Ahlawat)లు ఇప్పటికే పతకం ఖాయం చేయగా, గోల్డ్ మెడల్ కోసం ఫైనల్ బౌట్‌కు రెడీ అవుతున్నారు.


నేడు (ఆదివారం) మరింత మంది ఆటగాళ్లు బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఈ రాత్రి 9.30 గంటలకు ఆస్ట్రేలియాతో ఫైనల్స్‌లో తలపడుతుంది. కామన్వెల్త్ గేమ్స్  పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 46 పతకాలతో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 16 బంగారు పతకాలు, 12 రజతాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి.

Updated Date - 2022-08-07T22:27:39+05:30 IST