Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏంటిది మిశ్రా.. ఏకి పారేసిన నెటిజన్లు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ కేపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియాకు బదులుగా న్యూజిలాండ్‌కు అభినందనలు తెలపడమే అతడు చేసిన తప్పు. ‘అద్భుతంగా ఆడారు’ అంటూ న్యూజిలాండ్ జట్టును పొరపాటున ట్యాగ్ చేస్తూ పొగిడేశాడు. 


ఇది చూసిన నెటిజన్లు అమిత్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. చేసిన తప్పును తెలుసుకున్న మిశ్రా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే దాని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాను చుట్టేశాయి. కొందరైతే అతడు పొరపాటు పడ్డాడా? లేదంటే న్యూజిలాండ్‌ను ఎగతాళి చేస్తున్నాడా? అని ప్రశ్నిస్తే, ఇంకొందరమే ‘మరీ అంతలా తాగాలా?’ అని కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement