కోవిడ్ ప్రికాషన్ డోస్ తీసుకున్న స్టాలిన్, నఖ్వి

ABN , First Publish Date - 2022-01-11T17:34:09+05:30 IST

దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఈనెల 10 నుంచి కోవిడ్ ప్రికాషన్‌ వ్యాక్సిన్ మొదలు..

కోవిడ్ ప్రికాషన్ డోస్ తీసుకున్న స్టాలిన్, నఖ్వి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఈనెల 10 నుంచి కోవిడ్ ప్రికాషన్‌ వ్యాక్సిన్ మొదలు కావడంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారంనాడు చెన్నైలో ఈ ప్రికాషన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్నారు. మనమంతా ఆశావహంగా ఉండాలని, కోవిడ్‌పై పోరాటానికి భయపడాల్సిన పనిలేదని నఖ్వి ఈ సందర్భంగా తెలిపారు. అర్హులైన అందరూ ప్రికాషన్ డోస్‌లు తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో అదే రకం వ్యాక్సిన్ ప్రికాషనరీ డోస్‌లో ఇస్తారు. ఒమైక్రాన్ వేరియంట్ విజృంభణతో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ షాట్‌లు ఇవ్వాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-01-11T17:34:09+05:30 IST