అమెజాన్ తెచ్చిన తంటా...

ABN , First Publish Date - 2021-02-23T02:39:40+05:30 IST

‘అమెజాన్’... అమెరికన్లు ఈ పేరును పెట్టుకోవడమే తగ్గించారు. ఇంత ప్రాచుర్యంలో ఉన్న ఈ పదాన్ని పేరుగా పెట్టుకోవడం తగ్గించుకోవడమేమిటన్న సందేహం కలగక మానదు. అయితే... ఇది చదవండి.

అమెజాన్ తెచ్చిన తంటా...

న్యూయార్క్ : ‘అమెజాన్’... అమెరికన్లు ఈ పేరును పెట్టుకోవడమే తగ్గించారు. ఇంత ప్రాచుర్యంలో ఉన్న ఈ పదాన్ని పేరుగా పెట్టుకోవడం తగ్గించుకోవడమేమిటన్న సందేహం కలగక మానదు. అయితే... ఇది చదవండి. 


అలెక్సా...అమెజాన్‌ తెచ్చిన ఒక పాపులర్‌ ‘వర్చువల్‌ అసిస్టెంట్’‌. అంటే డిజిటల్‌ పనిమనిషి. సాధారణంగా కంపెనీలు తమ కొత్తకొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో కి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి.  వినియోగదారులను అక్కట్టుకునేందుకు వాడుకలో ఉండేలా రకరకాల పదాలతో పేర్లను పడుతుంటారు. దీంతో తదనంతర కాలంలో ఉత్పత్తి ప్రాచుర్యాన్ని బట్టి ఆయా కొత్తపేర్లూ పాపులర్‌ అవుతుంటాయి.


ఇదే క్రమంలో... 2014లో అమెజాన్‌ మార్కెట్‌లోకి తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను తెచ్చినప్పుడు దానికి అప్పటికే అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది. అదే... ‘అలెక్సా’.  అప్పట్లో అమెరికాలోని ఆడపిల్లలకు ఎక్కువగా పెట్టే పేర్లలో అలెక్సా కూడా ఒకటి. అయితే, అమెజాన్ వారి ప్రొడక్ట్‌ పాపులర్‌ అయింది.. కానీ, ఆ పేరు మాత్రం అన్‌పాపులర్‌ అయింది.


యూఎస్‌ సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం 2015 లో అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6,052 మందికి అలెక్సా అనే పేరు పెడితే.. 2019 నాటికి అ పేరు పెట్టేవారి సంఖ్య 1995 కి తగ్గిపోయింది. ఇక 2015లో ఆడపిల్లలకు పెట్టే పాపులర్‌ పేర్లలో అలెక్సా 32 వ స్థానంలో ఉండగా... నాలుగేళ్లలో అది 139 వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే... పిల్లలకు అలెక్సా అనే పేరు పెడితే... జీవితాంతం ఆ పేరు ఒక డిజిటల్‌ పనిమనిషి పేరుతో ముడిపడి ఉన్నట్లేనని భావిస్తుండడమే. దీంతో రానురాను ఆ పేరును పెట్టడం మానేసే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.

Updated Date - 2021-02-23T02:39:40+05:30 IST