హెచ్‌-1బీ జారీలో కీల‌క సంస్క‌ర‌ణ‌లకు ప్ర‌తిపాద‌న‌.. వారికే తొలి ప్రాధాన్యం !

ABN , First Publish Date - 2020-05-23T17:46:38+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికా మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో విల‌విల్లాడుతోంది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కోవిడ్-19 కోలుకోని దెబ్బ కొట్టింది.

హెచ్‌-1బీ జారీలో కీల‌క సంస్క‌ర‌ణ‌లకు ప్ర‌తిపాద‌న‌.. వారికే తొలి ప్రాధాన్యం !

వాషింగ్ట‌న్ డీసీ: అగ్ర‌రాజ్యం అమెరికా మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో విల‌విల్లాడుతోంది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కోవిడ్-19 కోలుకోని దెబ్బ కొట్టింది. దీంతో ఆ దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయింది. దీంతో దేశ పౌరుల ఉద్యోగావ‌కాశాల‌కు గండి ప‌డ‌కుండా యూఎస్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగా విదేశీయుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాల జారీ విధానంలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల వైపు అమెరికా అడుగులేస్తోంది. దేశ పౌరుల ఉపాధికి భంగం క‌ల‌గ‌కుండా, యూఎస్‌లో చ‌దువుకున్న విదేశీ నిపుణుల‌కు తొలి ప్రాధాన్యమిస్తూ ఒక బిల్లును రూపొందించి తాజాగా చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌వేశ పెట్టారు.


'ది హెచ్‌-1బీ అండ్ ఎల్‌-1 వీసా రిఫార్మ్ యాక్ట్‌' పేరిట ఆ దేశంలోని రెండు ప్ర‌ధాన పార్టీలు ఈ బిల్లును రూపొందించాయి. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారుల‌ను నియ‌మించ‌డాన్ని పూర్తిగా నిషేధించాల‌ని ఈ బిల్లులో పేర్కొన్నారు. ప్ర‌ధానంగా తాత్కాలిక శిక్ష‌ణా ప్ర‌యోజ‌నాల కోసం భారీగా హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగుల‌ను విదేశాల నుంచి ర‌ప్పించి తిరిగి వారిని స్వదేశాల‌కు పంపిస్తున్న సంస్థ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిల్లులో ప్ర‌తిపాదించారు. అలాగే యూఎస్‌లో చ‌దువుకొని మంచి నైపుణ్యం క‌లిగిన విదేశీ విద్యార్థుల‌కు హెచ్‌-1బీ జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఈ బిల్లులో పేర్కొన‌డం జ‌రిగింది.        

Updated Date - 2020-05-23T17:46:38+05:30 IST