స్వదేశానికి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న అమెరికన్లు.. భార‌త్‌లోనే ఉంటామని..

ABN , First Publish Date - 2020-04-08T13:22:25+05:30 IST

భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు తమ దేశానికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు.

స్వదేశానికి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న అమెరికన్లు.. భార‌త్‌లోనే ఉంటామని..

కరోనా విజృంభణతో స్వదేశానికి 

వెళ్లేందుకు అమెరికన్ల వెనకడుగు

అమెరికాకు వెళ్లం.. భారత్‌లోనే సురక్షితం 

స్వదేశానికి వెళ్లేందుకు అమెరికన్ల వెనకడుగు 

శంషాబాద్‌ నుంచి అమెరికాకు 99 మంది 

ఇదే చివరి అవకాశం.. ఇప్పుడే రండి: అమెరికా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు తమ దేశానికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో భారత్‌లో ఉండడమే మంచిదని అమెరికన్లు భావిస్తున్నారు. స్వదేశానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే అనేక మంది అమెరికన్లు వెనక్కి తీసుకున్నారని కాన్సులర్‌ వ్యవహారాల డిప్యూటీ సహాయ కార్యదర్శి ఇయాన్‌ బ్రౌన్‌లీ తెలిపారు.


విదేశాల్లో చిక్కుకున్న అమెరికన్లను స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అక్కడే ఉండదల్చుకుంటే వారి ఇష్టమని బ్రౌన్‌లీ వెల్లడించారు. కాగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న 99 మంది అమెరికా పౌరులను మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఏ-320 ఎయిర్‌ ఇండియా విమానంలో అమెరికాకు తరలించారు.

Updated Date - 2020-04-08T13:22:25+05:30 IST