అమెరికా యువతికి భారత్‌లో ఆపరేషన్ .. కోటి రూపాయల శస్త్రచికిత్స లక్షన్నరలో పూర్తి..! రష్యా టెక్నిక్‌ను ఉపయోగించి..

ABN , First Publish Date - 2021-11-28T01:09:46+05:30 IST

రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ ఎస్‌ఎమ్ఎస్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు. అమెరికాలో దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్‌ను కేవలం లక్షన్నరలోనే పూర్తి చేసి..అమెరికా యువతికి స్వాంతన చేకూర్చారు.

అమెరికా యువతికి భారత్‌లో ఆపరేషన్ .. కోటి రూపాయల శస్త్రచికిత్స లక్షన్నరలో పూర్తి..! రష్యా టెక్నిక్‌ను ఉపయోగించి..

ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో వైద్యం ఎంతటి ఖరీదైన వ్యవహారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌తో పాటూ అనేక దేశాల్లోని ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక నానా అవస్తలూ పడుతుంటారు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో కంటే భారత్ వంటి దేశాల్లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే  మెడికల్ టూరిజం అని అంటుంటారు. అయితే.. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ ఎస్‌ఎమ్ఎస్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు.  అమెరికాలో దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్‌ను కేవలం లక్షన్నరలోనే పూర్తి చేసి..అమెరికా యువతికి స్వాంతన చేకూర్చారు. 


మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎస్‌ఎమ్ఎస్‌లో ఆమె శస్త్రచికిత్స చేయించుకోవడం ఇది రెండోసారి.  2007లో వైద్యులు ఆమె తొడల ఎముకల పొడవు 7 సెంటీమీటర్ల మేర పెంచేందుకు ఇదే శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత అమెకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకపోవడంతో రెండోసారి కూడా శస్త్రచికిత్స చేసుకునేందుకు ముందుకు వచ్చింది. రష్యా టెక్నిక్‌ను వినియోగించి చేసిన ఈ రెండు శస్త్రచికిత్సల తరువాత ఆమె ఎత్తు మునుపటితో పోలిస్తే 15 సెంటీమీటర్ల మేర పెరిగింది. అక్కడి ఆర్థొపెడిక్ డిపార్ట్‌మెంట్ సీనియర్ ప్రొఫెసన్ డా. మీనా ఈ విషయాలను ఇటీవల మీడియాకు వెల్లడించారు. 


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన యాంజెలీనా(పేరు మార్చాం) అనువంశిక కారణాల రీత్యా 4 అడుగులకు మించి ఎత్తు పెరగలేదు. అమె సమస్యకు ఉన్న ఏకైక పరిష్కార మార్గం శస్త్రచికిత్స. ఆపరేషన్ ద్వారా కాలి ఎముకుల పొడవును పెంచితేనే ఆమె ఎత్తు పెరిగే అవకాశం ఉంది. అయితే.. అమెరికాలో ఈ ఆపరేషన్ చేయాలంటే దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఆమె తన శస్త్రచికిత్స కోసం  భారత్‌లోని ఎస్‌ఎమ్ఎస్‌ ఆస్పత్రిని ఎంచుకుంది. దీంతో.. బుధవారం వైద్యులు ఆమెకు ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. మెకాళ్ల కింది ఎముకల్లో రాడ్లను ఏర్పరిచి వాటి పొడవును 8 సెంటీమీటర్ల మేర పెంచగలిగారు. 

Updated Date - 2021-11-28T01:09:46+05:30 IST