Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ రెండింటితోనే Afghanistan నుంచి.. America Woman ఆవేదన

వాషింగ్టన్: తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్పుడు అశాంతికి నిలయంగా మారిన విషయం తెలిసిందే. తాలిబన్ల చేతుల్లో అక్కడి ప్రజలు.. ముఖ్యంగా విదేశాలకు చెందిన ప్రజలు ఎంత త్వరగా సాధ్యమైతే అంత వేగంగా ఆ దేశాన్ని వదిలి సొంతదేశాలకు పారిపోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఏకైక మార్గమైన కాబూల్ విమానాశ్రయం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కట్టుబట్టలతో విమానం ఎక్కి తమ దేశాలకు బతుకుజీవుడా అని చేరుకుంటున్నారు. అలా తన స్వదేశం చేరుకున్న ఓ అమెరికన్ మహిళకు సంబంధించిన దీనగాధే ఇది.

చేతిలో మొబైల్, పెళ్లి సర్టిఫికేట్ తప్ప మరేమీ తీసుకోకుండా కట్టుబట్టలతో అమెరికా వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద అమెరికన్ అధికారులను అర్థించసాగిందామె. ఆమె పేరు షరీఫా అఫ్జలి. ఎయిర్‌పోర్ట్‌లో కాపలా కాస్తున్న అమెరికన్ ఆర్మీ అధికారులు ఆమెను లోనికి రానివ్వకపోవడంతో.. తన చేతిలోని మొబైల్‌తో అమెరికాలోని తన భర్తకు ఫోన్ చేసి దగ్గరలోని ఆర్మీ అధికారికిచ్చింది.

అవతలి నుంచి ఆమె భర్త, అమెరికాలోని ఓక్లహామా నగరానికి చెందిన ఆర్మీ వెటరన్ అధికారి హాన్స్ రైట్ మాట్లాడాడు. ఆమె తన భార్య అని, తాను ఎంతగానో ప్రేమించే ఆమెను అమెరికాకు రానివ్వాలని, కట్టుబట్టలతో వచ్చిన ఆమెపై దయతలిచి విమానాశ్రయంలోనికి అనుమతించాలని కూడా గేటు వద్ద భద్రతా సిబ్బందిని అర్థించాడు. అక్కడి అధికారి మనసు కరగడంతో ఆమెను లోనికి అనుమతించాడు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె విమానాశ్రయంలోనికి అడుగుపెట్టింది. విమానం ఎక్కి స్వదేశానికి బయలుదేరింది.

కాగా.. మంగళవారంతో అఫ్ఘాన్ నుంచి పౌరులను తరలించేందుకు అమెరికా నిర్వహిస్తున్న కార్యక్రమం ముగియనుంది. ఈ క్రమంలోనే గ్రీన్ కార్డ్, లేదా కనీసం అమెరికన్ పాస్ పోర్ట్ ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయంలోనికి అనుమతించేలా జో బైడెన్ సర్కార్ నిబంధనలు విధించింది. దీంతో అనేకమంది నానా అవస్థలు పడుతున్నారు. అమెరికన్ పాస్ పోర్ట్ కానీ, గ్రీన్ కార్డ్ కానీ లేని వారు తమ పిల్లలనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారిని తమ బంధువులతో పంపించివేస్తున్నారు. మరికొందరు గ్రీన్ కార్డ్ హోల్డర్లు, లేదా యూఎస్ పాస్ పోర్ట్ ఉన్న వారు ఎలాగోలా తమ పిల్లలను కూడా తమ వెంట తెచ్చుకుంటున్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement