లాక్‌డౌన్ తొలగించండి.. మాస్కుల బికినీతో మహిళ నిరసన

ABN , First Publish Date - 2020-05-27T01:46:12+05:30 IST

కరోనా కారణంగా అమెరికాలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ నిబంధనలను...

లాక్‌డౌన్ తొలగించండి.. మాస్కుల బికినీతో మహిళ నిరసన

వాషింగ్టన్: కరోనా కారణంగా అమెరికాలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ నిబంధనలను అక్కడి ప్రజలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని, బంధించడానికి వీలులేదని రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని దవీద సాల్ అనే స్థానిక పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కరోనా మాస్కులతో తయారుచేసిన టూ పీస్ బికినీ ధరించి ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ విధించడం సరైన పద్ధతి కాదని, వెంటనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. తాను ఈ విధంగా నిరసించడంపై అందరూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని దావిదా పేస్‌బుక్ ద్వారా కోరారు.

Updated Date - 2020-05-27T01:46:12+05:30 IST