అరిజోనా రాష్ట్రంలో ATA ఫీనిక్స్ టీం ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-10T14:21:01+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారు నూతనంగా అరిజోనా రాష్ట్రంలో ఫీనిక్స్ టీంను ప్రారంభించారు.

అరిజోనా రాష్ట్రంలో ATA ఫీనిక్స్ టీం ప్రారంభం

అరిజోన: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారు నూతనంగా అరిజోనా రాష్ట్రంలో ఫీనిక్స్ టీంను ప్రారంభించారు. జూన్ 5వ తారీఖున అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో పాటల పోటీలు, నృత్య పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. 



ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల మాట్లడుతూ.. 100 మందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.  ఫీనిక్స్ లోకల్ టీం సేవలను కొనియాడారు. విజేతలకు బహుమతులు అందజేశారు. రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె, కో-చైర్ ఆటా స్పోర్ట్స్ వంశీ ఏరువారం ఆర్.సి., చెన్నయ్య మద్దూరి ఆర్.సి., ఈవెంట్ కోఆర్డినేటర్ బిందా కిరణ్ కొత్తగా సభ్యులను చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారు. వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి మహీధర్, కిరణ్మయి జ్యోతుల,నీరజ వ్యవరించారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆకాంక్షించారు. ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి, మదన్ గోపాల్ బొల్లారెడ్డి, ఋక్కు మిల, అనుదీప్ యాపల, సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్ గంగవల్లి, విజయ్ కందుకూరి తదితరులను అభినందించారు.


Updated Date - 2022-06-10T14:21:01+05:30 IST