అంతరిక్షంలో ఫ్యాక్టరీలు.. అమెరికా కంపెనీకి 42 మిలియన్లు

ABN , First Publish Date - 2021-07-30T07:21:00+05:30 IST

భూమిపై ఫ్యాక్టరీలు కట్టే కంపెనీలను ఇప్పటివరకు చూసి ఉంటారు. ఎంతో నైపుణ్యంతో, అనుభవజ్ఞులైన సిబ్బందితో..

అంతరిక్షంలో ఫ్యాక్టరీలు.. అమెరికా కంపెనీకి 42 మిలియన్లు

భూమిపై ఫ్యాక్టరీలు కట్టే కంపెనీలను ఇప్పటివరకు చూసి ఉంటారు. ఎంతో నైపుణ్యంతో, అనుభవజ్ఞులైన సిబ్బందితో ఈ ఫ్యాక్టరీలు పనిచేస్తుంటాయి. అయితే తాజాగా ఓ అమెరికన్ స్టార్టప్‌ కంపెనీ మాత్రం ఏకంగా అంతరిక్షంలో ఫ్యాక్టరీలు నిర్మిస్తామంటూ ముందుకొచ్చింది. ఆ కంపెనీ పేరు వార్ద. వార్ద స్పేస్ ఇండస్ట్రీస్ పేరుతో స్థాపించిన ఈ సంస్థ.. తొలి రౌండ్‌లోనే దాదాపు 42 మిలియన్ల ఫండింగ్ సంపాదించింది.




 సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్ద సంస్థ సీఈవో విల్ బ్రూ మాట్లాడుతూ.. అంతరిక్షంలో తొలి ఫ్యాక్టరీ నిర్మించడమే తమ లక్ష్యమని, మొత్తంగా ఓ కక్ష్యలో ఓ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కాగా.. మరో 18 నెలల్లో వార్దా సంస్థ తమ తొలి వాహక నౌక అంతరిక్షంలోకి పంపడం, తిరిగి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. దాని ద్వారా దాదాపు 100 కిలోల మెటీరియల్‌ను తీసుకెళ్లి, తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది.

Updated Date - 2021-07-30T07:21:00+05:30 IST