Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 15 Dec 2021 13:59:11 IST

11 ఏళ్ల వయసులో అలాంటి వీడియోలు చూసి.. చాలా డిస్ట్రర్బ్ అయ్యా: గాయని

twitter-iconwatsapp-iconfb-icon
11 ఏళ్ల వయసులో అలాంటి వీడియోలు చూసి.. చాలా డిస్ట్రర్బ్ అయ్యా: గాయని

‘ఓసియన్ ఐస్’, ‘బ్యాడ్ గాయ్’, ‘వెన్ ది పార్టీ ఇస్ ఓవర్’ అనే పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్. ఈ తార తన పాటలతోనే కాకుండా బ్యూటీతో కూడా అభిమానుల గుండెలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో తన జీవితంపై పోర్న్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందో వివరించింది.


బిల్లీ ఎలిష్ మాట్లాడుతూ చిన్న వయస్సులో పోర్న్ చూడటం ఒకరి లైంగిక అనుభవాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. అశ్లీలత మహిళల శరీరాలను ఎలా చిత్రీకరిస్తుందో ఈ బ్యూటీ చెప్పింది. సింగర్ మాట్లాడుతూ.. ‘పదకొండేళ్ల వయస్సులో మొదటిసారి పోర్న్ చూశా. అప్పుడు చాలా డిస్ట్రర్బ్ అయ్యా. ఆ ఆలోచన దాదాపు నాశనం చేసింద’ని తెలిపింది.


ఈ బ్యూటీ ఇంకా మాట్లాడుతూ.. ‘అది ఎందుకు చెడ్డ విషయమని అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. చాలా మంది వాటిని చూసే సెక్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. దీని గురించి మాట్లాడడానికి నేనే మాత్రం సంకోచించను.  అందుకు చాలా సంతోషిస్తున్నా‌న’ని చెప్పింది.


అంతేకాకుండా ఈ సింగర్ తన లైంగిక అనుభవాల గురించి మాట్లాడింది. 

ఆమె పోర్న్ చూడటం వల్ల వారు ఎలా ప్రభావితమయ్యిందో తెలిపింది. అశ్లీలత వల్ల వచ్చే కొన్ని సమస్యలను కూడా వివరించింది. హింసాత్మకమైన, అబ్యూసివ్ కంటెంట్ చూడడం వల్ల పడుకున్నప్పుడు పీడకలలు వచ్చినట్లు తెలిపింది.


బిల్లీ ఈ సమస్యను ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు తన సాంగ్‌లో దీనిపై చర్చించింది. మేల్ ఫాంటసీ అనే ఈ పాటలో ఇంట్లో ఒంటరిగా ఉండటం, అశ్లీల చిత్రాలతో చూడడం ద్వారా దృష్టి మరల్చడం గురించి కూడా గట్టిగా చెప్పింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement