భర్త ఇంట్లో లేనప్పుడు.. ప్రియుడితో రాసలీలలు.. అంతలో భర్త ఇంటికి తిరిగిరావడంతో..

ABN , First Publish Date - 2022-04-19T06:23:51+05:30 IST

అతను అమెరికా నేవీలో అధికారి. ఉద్యోగ రీత్యా తరచుగా వేరే ప్రాంతాలకు వెళుతుంటాడు. దీంతో అతని భార్య మరోపురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇన్నాళ్లూ భర్తకు తెలియకుండా అతడితో రొమాన్స్ సాగించింది. ఒకరోజు భర్త తన భార్యకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చేందుకు...

భర్త ఇంట్లో లేనప్పుడు.. ప్రియుడితో రాసలీలలు.. అంతలో భర్త ఇంటికి తిరిగిరావడంతో..

అతను అమెరికా నేవీలో అధికారి. ఉద్యోగ రీత్యా తరచుగా వేరే ప్రాంతాలకు వెళుతుంటాడు. దీంతో అతని భార్య మరోపురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇన్నాళ్లూ భర్తకు తెలియకుండా అతడితో రొమాన్స్ సాగించింది. ఒకరోజు భర్త తన భార్యకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ప్రియుడితో అతని భార్య కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.. తీవ్ర షాక్‌కు గురైన అతను వారిద్దరినీ ఏం చేశాడంటే..


అమెరికాలోని వర్జీనియాలో ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల టైలర్ లేమార్ అనే వ్యక్తి యూఎస్ నేవీలో సెయిలర్‌గా పనిచేస్తుంటాడు. ఉద్యోగ రీత్యా తరచుగా పర్యటనలకు వెళుతుంటాడు. అతని భార్య జెన్కిన్స్ అనే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త టూర్‌కు వెళ్లినపుడు ప్రియుడు జెన్కిన్స్‌కు తన ఇంటికే రప్పించుకుని రొమాన్స్ సాగించేది. గత సోమవారం టైలర్ ఇంటికి వచ్చే సమయానికి జెన్కిన్స్ అక్కడ కనిపించాడు. 


తన బెడ్రూమ్‌లో తన భార్యతో రొమాన్స్ చేస్తూ టేలర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన టేలర్ తుపాకీ తీసుకుని జెన్కిన్స్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో జెన్కిన్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు టేలర్‌ను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-19T06:23:51+05:30 IST