Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అరగంటలో 5 కోట్ల సంపాదన! కరోనా టైంలో ఓ సామాన్యుడు చేసిన అద్భుతం.. అసలు ఇదెలా సాధ్యమైందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
అరగంటలో 5 కోట్ల సంపాదన! కరోనా టైంలో ఓ సామాన్యుడు చేసిన అద్భుతం.. అసలు ఇదెలా సాధ్యమైందంటే..

ఎన్నారై డెస్క్: 5 కోట్లు సంపాదించాలంటే సామాన్యుడికి ఓ జీవిత కాలం పడుతుంది. కానీ.. అమెరికాలోని కామన్‌మ్యాన్ మాత్రం జస్ట్ అరగంటలో 5 కోట్లు ఆర్జించాడు. యస్..ఇది నిజం! ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న అనేక అద్భుతాల్లో ఇదీ ఒకటి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

కరోనా సంక్షోభం మానవ సమాజంలో అనేక మార్పులకు కారణమైంది. ఇందులో ప్రధానమైదని డిజిటల్ బాట పట్టడం. కరోనా నుంచి తప్పించుకునేందుకు ప్రజలందరూ నాలుగు గోడలకు పరిమితమయ్యారు. తమ అవసరాలు తీర్చుకునేందుకు డిజిటల్ ఉత్పత్తులపై ఆధారపడ్డారు. అలా.. ప్రజల జీవితంలో డిజిటల్ మాధ్యమాలు, ఉత్పత్తులు ఓ ముఖ్యభాగమైపోయాయి. ఇది నాణేనికి ఓవైపు. ఇక నాణేనికి రెండో వైపున..కరోనా దెబ్బకు ప్రజల ఆర్థికస్థితిగతులు తలికిందులైన ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ క్యామ్ రక్కమ్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. 

కాలిఫోర్నియాలో నివసించే క్యామ్..కొవిడ్ బారిన పడి ఆర్థికంగా తలకిందులైపోయాడు. తీవ్ర నష్టాలపాలయ్యాడు. అటువంటి సమయంలో డిజిటల్ ప్రపంచం ఇచ్చే ఓ అవకాశన్ని ఒడిసిపట్టి.. అద్భుతం సాధించాడు. ఆదాయం కోసం అతడు తాను వేసిన పెయింటింగ్స్‌ను వేలానికి పెట్టాడు. పెయింట్ ఆకర్షనీయంగా ఉండటంతో వేలంలో బాగా ధర పలికింది. నెటిజన్లు పోటాపోటీగా బిడ్స్ దాఖలు చేయడంతో.. చివరకు రూ. 5 కోట్లకు తన పెయింటింగ్ అమ్ముడుపోయింది. ఇదంతా కేవలం 32 నిమిషాల్లో జరిగిపోయింది. చూస్తుండగానే అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.