బహిరంగంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటాం

ABN , First Publish Date - 2020-12-05T07:56:07+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగం గా వేయించుకుని దాని గురించి ప్రజల్లో నమ్మకాన్ని నింపడానికితాము సిద్ధమని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి డబ్ల్యూ.బుష్‌, బిల్‌ క్లింటన్‌తో పాటు ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టనున్న బైడెన్‌ చెప్పారు...

బహిరంగంగా వ్యాక్సిన్‌ వేయించుకుంటాం

  • ఒబామా, బుష్‌, బిల్‌ క్లింటన్‌, బైడెన్‌ ప్రకటన


వాషింగ్టన్‌, డిసెంబరు 4: కరోనా వ్యాక్సిన్‌ను బహిరంగం గా వేయించుకుని దాని గురించి ప్రజల్లో నమ్మకాన్ని నింపడానికితాము సిద్ధమని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి డబ్ల్యూ.బుష్‌, బిల్‌ క్లింటన్‌తో పాటు ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టనున్న బైడెన్‌ చెప్పారు. బుష్‌, క్లింటన్‌ల తరఫున వారిప్రతినిధులు ఈ ప్రకటనలు చేశారు. ఏదైనా ఓ వ్యాక్సిన్‌ సురక్షితమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆం టోనీ ఫౌసీ ప్రకటిస్తే దాన్ని వేయించుకుంటానని ఒబామా తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందితే తానూ వ్యాక్సిన్‌ వేయించుకుంటానని జో బైడెన్‌ చెప్పారు. 

Updated Date - 2020-12-05T07:56:07+05:30 IST