Abn logo
Jan 23 2021 @ 16:23PM

మెబైల్ యాప్స్‌తో డేటా లీక్.. అమెరికాకు అమ్ముతున్న బ్రోకర్లు!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ ప్రభుత్వ సంస్థ సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ప్రజల డేటాను మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేస్తున్నామని యూఎస్ డీఐఏ అనే ప్రభుత్వ రంగ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల మొబైల్స్‌లోెని అప్లికేషన్ల నుంచి మధ్యవర్తులు ఈ డేటాను సేకరిస్తారని, వారి ద్వారానే తాము కొనుగోలు చేస్తామని సదరు సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రకటన అధికారికంగా విడుదల చేయకూపోయినా.. ఆ సంస్థకు చెందిన ఓ మెమో ద్వారా వెల్లడైంది. దీంతో ప్రస్తుతం అక్కడ పెద్ద దుమారమే రేగుతోంది. అమెరికాలోని ప్రజల మొబైల్ ఫోన్లలోని అప్లికేషన్ల ద్వారా వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, సదరు లొకేషన్ డేటాను కమర్షియల్ డేటాబేజ్‌ల నుంచి కొనుగోలు చేస్తున్నామని ప్రకటించింది.

 గత రెండున్నరేళ్లలో అమెరికా ఇలా ఐదు సార్లు డేటాను తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు అమెరికా ప్రజల మొబైల్ డేటా మాత్రమే కాకుండా ఇతర దేశాలలోని మొబైల్ వినియోగదారుల డేటాను కూడా మధ్యవర్తుల ద్వారా ఈ అమెరికన్ ఏజెన్సీ కొనుగోలు చేస్తోందని ఆ మెమో ద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement