భారత్‌కు అమెరికా కంపెనీల బాసట

ABN , First Publish Date - 2021-05-06T06:30:02+05:30 IST

కొవిడ్‌ పోరులో భారత్‌కు బాసటగా నిలబడేందుకు 40 అగ్రశ్రేణి అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందుకోసం ఈ కంపెనీల సీఈఓలు ‘ ది గ్లోబల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ పాండమిక్‌ రెస్పాన్స్‌’ పేరుతో...

భారత్‌కు అమెరికా కంపెనీల బాసట

వాషింగ్టన్‌ : కొవిడ్‌ పోరులో భారత్‌కు బాసటగా నిలబడేందుకు 40 అగ్రశ్రేణి అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందుకోసం ఈ కంపెనీల సీఈఓలు ‘ ది గ్లోబల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ పాండమిక్‌ రెస్పాన్స్‌’ పేరుతో ప్రత్యేక  కార్యాచరణ గ్రూపుగా ఏర్పడ్డారు. వచ్చే నెల 3వ తేదీలోగా భారత్‌కు 1,000 వెంటిలేటర్లు, 25,000 ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు పంపిస్తున్నట్టు ఈ టాస్క్‌ ఫోర్స్‌ ప్రకటించింది. అక్సెంచర్‌, అమెజాన్‌, యాపిల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఫెడ్‌ఎక్స్‌, ఐబీఎం వంటి  ప్రముఖ కంపెనీల సీఈఓలు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులు. 


Updated Date - 2021-05-06T06:30:02+05:30 IST