అమెరికా అమ్మాయి తెలుగు పలుకు.. దిక్కులపై చెప్పిన రైమ్ అదుర్స్

ABN , First Publish Date - 2021-11-25T22:04:16+05:30 IST

తెలుగుని ఎంతో ప్రేమించే అమెరికా అమ్మాయి బ్రీ- ఈశాన్యం... ఆగ్నేయం... వాయువ్యం... నైఋతి... లను కూడా తడుముకోకుండా చెప్పేలా ఒక రైమ్ ని ఒక వీడియోగా చేసింది.

అమెరికా అమ్మాయి తెలుగు పలుకు.. దిక్కులపై చెప్పిన రైమ్ అదుర్స్

ఇంటర్నెట్ డెస్క్: ఉదయించే సూర్యుడి ముందు నిలబడి ఏవో కసరత్తులు చేసి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని తెలుగులో ఇంగ్లీషులో చెప్పేస్తామేమో గానీ, వాటి మధ్య దిక్కులు చెప్పమంటే దిక్కులు చూస్తాం కదా. తెలుగుని ఎంతో ప్రేమించే అమెరికా అమ్మాయి బ్రీ- ఈశాన్యం... ఆగ్నేయం... వాయువ్యం... నైఋతి... లను కూడా తడుముకోకుండా చెప్పేలా ఒక రైమ్ ని ఒక వీడియోగా చేసింది. తెలుగు రాయడం చదవడం వచ్చిన బ్రీ - సిలికానాంధ్ర మనబడి విద్యార్థిని. వీడియో చూసిన తెలుగువారందరూ అమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘మీ తెలుగు ఎంతో బాగుంది’’ అంటూ కామెంట్ చేశారు. తెలుగు భాషపై ఓ అమెరికా మహిళ చూపిస్తున్న అభిమానానికి సంబరపడ్డారు. మరి.. మీరూ ఓ మారు ఈ వీడియోను చూడండి..!



Updated Date - 2021-11-25T22:04:16+05:30 IST