పాక్ మంత్రి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు: అమెరికా మహిళ సంచలన ఆరోపణ

ABN , First Publish Date - 2020-06-06T17:49:39+05:30 IST

అమెరికా బ్లాగర్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు సింథియా రిచీ.. పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మలిక్‌పై సంచనల ఆరోపణలు చేశారు.

పాక్ మంత్రి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు: అమెరికా మహిళ సంచలన ఆరోపణ

ఇస్లామాబాద్: అమెరికా బ్లాగర్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు సింథియా రిచీ.. పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మలిక్‌పై సంచనల ఆరోపణలు చేశారు. 2011లో రెహ్మాన్ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. తన విసా విషయమై చర్చించేందుకు వెళ్లినప్పుడు తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు.


పాక్ మాజీ ప్రధాని యూసఫ్ గిలానీ, మాజీ మంత్రి మఖ్దూమ్ షాబుద్దీన్‌‌లూ తనపై భౌతిక దాడికి దిగారని కూడా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.


ఈ ఉదంతం ప్రస్తుతం పాక్ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ ప్రతి పక్ష పీపీపీ‌లో ముఖ్యులవడంతో ఆ పార్టీలోనూ కల్లోలం రేగుతోంది. అంతకుమునుపు.. సింథియాపై  పీపీపీ సభ్యుడొకరు పరువు నష్టం దావా వేశారు. పీపీపీ దివంగత నేత బేనజీర్ భుట్టో పరువురు మర్యాదలకు భంగం వాటిల్లేలా సింథియా అసభ్య వ్యాఖ్యలు చేసిందని తన పిటీషన్‌లో ఆరోపించారు. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వ్యక్తిగత జీవితంపై సింథియా రచించిన పుస్తకమే తాజా వివాదానికి కేంద్ర బిందువని తెలుస్తోంది.


ఈ పుస్తకంలోని కొన్ని కీలక వివరాలు  సింథియా గత వారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2004లో బేనజీర్ భుట్లో ఇంట్లో 2200 డాలర్ల విలువైన లైంగిక ఆట వస్తువులు ఉన్నాయని, తలసరి ఆదాయం 3000 డాలర్లుగా ఉన్న దేశంలో ఇటువంటివి జరగడం సబబు కాదని ఆమె వెల్లడించారు. బేనజీర్ భుట్టో కుమారుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత బిలావాల్ భుట్టొపై కూడా ఆమె పలు ఆరోపణలు చేశారు. ఈ పరిమాణాలు పాక్ రాజకీయల్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Updated Date - 2020-06-06T17:49:39+05:30 IST