Robbery in Flight: ఇద్దరు మహిళల నుంచి రూ.7.9లక్షలతో పాటు రెండు క్రెడిట్ కార్డులు కొట్టేసిన ప్రయాణికుడు.. చివరికి

ABN , First Publish Date - 2022-07-08T21:05:47+05:30 IST

విమానంలో దొంగతనం జరిగింది. బ్యూనస్ ఎయిర్స్ నుంచి మియామి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళల నుంచి 10వేల డాలర్లు(రూ.7.90లక్షలు) దొంగిలించాడు.

Robbery in Flight: ఇద్దరు మహిళల నుంచి రూ.7.9లక్షలతో పాటు రెండు క్రెడిట్ కార్డులు కొట్టేసిన ప్రయాణికుడు.. చివరికి

ఫ్లోరిడా: విమానంలో దొంగతనం జరిగింది. బ్యూనస్ ఎయిర్స్ నుంచి మియామి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు ఇద్దరు మహిళల నుంచి 10వేల డాలర్లు(రూ.7.90లక్షలు) దొంగిలించాడు. అలాగే మరో ఇద్దరు ప్రయాణికుల నుంచి రెండు క్రెడిట్ కార్డులు తస్కరించాడు. అయితే, విమానం ఫ్లోరిడాలో ల్యాండ్ అయిన తర్వాత చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. డీగో సెబాస్టియన్ రేడియో అనే వ్యక్తి మంగళవారం బ్యూనస్ ఎయిర్స్ నుంచి మియామి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కి చేతివాటం చూపించాడు. మొదట ఇద్దరు మహిళల నుంచి రూ. 7.9లక్షలు కొట్టేసిన అతగాడు.. ఆ తర్వాత మరో ఇద్దరు ప్రయాణికుల క్రెడిట్ కార్డులు దొంగిలించాడు. 


ఈ క్రమంలో రేడియో విమానంలో ఒకచోట కుదురుగా కూర్చొకుండా తిరుగుతుండడం, బాధితులలో ఒకరి దగ్గర అతనికి కేటాయించని సీటులో కూర్చోవడం విమాన సిబ్బంది చూశారు. దాంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా అతని వద్ద భారీ మొత్తంలో నగదుతో పాటు క్రెడిట్ కార్డులు బయటపడ్డాయి. విచారించగా అవి తాను దొంగిలించినట్లుగా అంగీకరించాడు. దాంతో విమానంలోని ప్రయాణికులను వారివారి పర్సులను చెక్ చేసుకోమని విమాన సిబ్బంది అప్రమత్తం చేశారు. అనంతరం నలుగురు ప్రయాణికులు తమకు సంబంధించిన రూ.7.9లక్షల నగదుతో పాటు, రెండు క్రెడిట్ కార్డులు చోరీ అయినట్లు చెప్పారు. దాంతో రేడియో నుంచి రికవరీ చేసిన నగదుతో పాటు క్రెడిట్ కార్డులను వారికి అప్పగించారు. అనంతరం విమానం ఫ్లోరిడాలో ల్యాండ్ కాగానే అతడిని పోలీసులకు అప్పగించారు.  

Updated Date - 2022-07-08T21:05:47+05:30 IST